Friday, April 26, 2024

టీఆర్ఎస్ లో సమైక్యవాదులు లేరా?: కేబినెట్ మంత్రులు ఎవరు?: జగ్గారెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన ముగిసిన తర్వాత ఈ టీఆరెస్ ప్రభుత్వంపై తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో సమైక్యవాదులు కనిపించడం లేదా అంటూ నిప్పులు చెరిగారు. తాను అప్పుడు ఇప్పుడు సమైక్యవాదినే అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఉద్యమంలో కేసీఆర్ ఊరికించి కొడుతానన్న ఎర్రబెల్లి దయాకర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్.. టీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి పువ్వడా అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నికర్సైనా  స్వమైక్యవాదులే అని చెప్పారు.

ఉద్యమ సమయంలో టీఆరెస్  కార్యకర్తలను ఊరికించి కొట్టిన దానం నాగేందర్ ఇప్పుడు టీఆరెస్ లొనే ఉన్నాడని మండిపడ్డారు. మీ టీఆరెస్ పార్టీ లో,ప్రభుత్వంలో ఉన్న సమైక్యవాదులు కనిపించడం లేదా ? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. దీనికి టీఆరెస్ పార్టీ ఎలాంటి జవాబు చెబుతుంది..దీని సమాధానం ఉందా..? అని ప్రశ్నించారు. సినిమా డైలాగ్ లు మాట్లాడడం కాదు…నువ్వు మాట్లాడిన మాటలను మేము సీరియస్ గానే తీసుకుంటున్నామన్నారు. తాను డైరెక్ట్ గా సమైక్యవాదిని , మీరు ఇండైరెక్టు గా సమైక్యవాదులే అని వ్యాఖ్యానించారు.

 రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పరిపాలనలో ఆంధ్ర కాంట్రాక్టర్ పని చేస్తున్నారని విమర్శించారు. మరొసారి మాట్లాడితే మీ మొత్తం చరిత్ర చెప్తా అని హెచ్చరించారు. రాహుల్ గాంధీని పదే పదే ఓయూకి రావొద్దని  మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ని ఓయూ కి రావొద్దు అనడానికి మీరు ఎవరు అని ప్రశ్నించారు. ఓయూ మీ అయ్యా జగిరా ? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. స్టూడెంట్స్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ ని ఓయూ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. చేతగాని మీ టీఆరెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించే విధంగా ఓయూ వీసీ ద్వారా ఈ నాటకం ఆడిస్తారా? అని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ పట్ల మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ని ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుపోలేని మీలంటూ దద్దమ్మలు టీవీలో మాట్లాడుతారా? ధ్వజమెత్తారు. బేషరతుగా రాహుల్ గాంధీ కి టీఆరెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేంతవరకు తమ నిరసనలు ఆగవని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement