Saturday, May 4, 2024

తెలంగాణ ఆర్టీసీ మ‌రో ఆఫ‌ర్ – నిరుద్యోగుల కోసం బ‌స్సుపాసుల‌పై డిస్కౌంట్

పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న తెలంగాణ నిరుద్యోగ యువ‌త‌కు బస్సుల‌పై ఆర్టీసీ డిస్కౌంట్ ని ప్ర‌క‌టించింది. నిరుద్యోగ యువతకు చేయూత అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఆర్టీసీ. సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ ల పై 20% డిస్కౌంట్ అందించనున్నట్లు గా స్పష్టం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఈ రెండు రకాల బస్సు పాసులు నగరంలోని అన్ని బస్ పాస్ కౌంటర్లలో పొందవచ్చునని తెలిపింది బస్ పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ కార్డు తో పాటుగా కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది. ఆర్డినరీ బస్సు పాస్ మూడు నెలలకు 20 శాతం డిస్కౌంట్ తో ఇవ్వనున్నట్లు ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement