Monday, April 29, 2024

మూడోరోజు న‌ష్టాలతో ముగిసిన స్టాక్ ‘మార్కెట్లు’

మూడోరోజు వ‌రుస‌గా న‌ష్టాల‌బాట ప‌ట్టాయి స్టాక్ మార్కెట్లు. ర‌ష్యా,ఉక్రెయిన్ యుద్ధం పెరుగుతుండ‌టం, క్రూడాయిల్ ధ‌ర‌లు మార్కెట్ల‌పై ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయి. కాగా నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 233 పాయింట్లు నష్టపోయి 57,362కి పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 17,153 వద్ద స్థిరపడింది. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.77%), ఏసియన్ పెయింట్స్ (0.76%), రిలయన్స్ (0.73%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.69%), కోటక్ బ్యాంక్ (0.50%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ నిలిచాయి. టైటాన్ (-3.59%), టెక్ మహీంద్రా (-2.35%), మారుతి (-1.79%), విప్రో (-1.18%), ఎల్ అండ్ టీ (-1.14%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement