Thursday, May 2, 2024

మీ ప్రేమ‌, ప్ర‌శంస‌లే ముందుకు న‌డిపిస్తున్నాయ్ – ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ థ్యాంక్స్

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కాగా ఓపెనింగ్ రోజే రూ.200కోట్లు వ‌సూళ్లు చేస్తుంద‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ జ‌ర్న‌లిస్ట్ ఉమైర్ సంధూ అన్నారు. ఈ చిత్రం టెర్రిఫిక్ అని ప్ర‌శంసించారు. చరణ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం సాధించింది. తనపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం మిస్ కాకుండా రాజమౌళి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. మరోవైపు ఈ సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. మీరు అందిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెపుతున్నానని ట్వీట్ చేశాడు. మీ ప్రేమ, ప్రశంసలే తనను ముందుకు నడిపిస్తున్నాయని చెప్పాడు. విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ను ఎంజాయ్ చేయండని కోరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement