Thursday, May 9, 2024

‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం హృద‌యాన్ని క‌దిలించే క‌థ‌నం – న‌టి ప్ర‌ణీత‌

ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై న‌టి ప్ర‌ణీత ఇన్ స్టా గ్రామ్ లో నోట్ రాసింది. 30ఏళ్ల క్రితం కాశ్మీరీ పండిట్ లు అనుభ‌వించిన హృద‌యాన్ఇన క‌దిలించే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రతి భారతీయ పౌరుడు ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ తప్పక చూడాలి. సినిమా ముగింపు సన్నివేశాల్లో నా భర్త, నేను కన్నీళ్లు పెట్టుకున్నాం. దయచేసి మీరు ఇంకా చూడకపోతే చూడండి’ అంటూ పోస్ట్ చేసింది. ఇటీల ప్రధాని మోడీ చిత్రం యూనిట్ ను ప్రశంసించిన విషయం తెలిసిందే. అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `ది కాశ్మీర్‌ ఫైల్స్. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో అభిషేక్‌ అగర్వాల్‌, వివేక్‌ అగ్నిహోత్రి, పల్లవి జోషి, జీ స్టూడియో నిర్మించారు. ఈసినిమా శుక్రవారం(మార్చి 11)న విడుదలైంది. తాజాగా ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. 1990 దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ మారణ హింసాకాండని ఆధారంగా చేసుకుని దర్శకుడు వివేక్‌అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని రూపొందించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపమే ఈ సినిమా.

Advertisement

తాజా వార్తలు

Advertisement