Thursday, April 25, 2024

Karnataka: పడుకున్న మహిళపై ప‌డ‌గ‌విప్పి నాట్య‌మాడిన‌ నాగన్న.. వ‌ణికిపోయిన మ‌హిళ‌!

కర్నాటకలోని కలబురిగి జిల్లాలో వింత ఘటన జ‌రిగింది. మల్లాబాద్ కు చెందిన భాగమ్మ తన పొలంలో పడుకుంది. అప్పుడు ఆమె వీపు మీద పెద్ద నాగు పాము వచ్చి పడగ విప్పి అక్క‌డే ఉండిపోయింది. దాన్ని అక్కడున్న వారు చూసి అరవడంతో మహిళకు మెళకువ వచ్చింది. ఈ క్రమంలో.. మహిళ వెంటనే భయంతో వణికిపోయింది. పాము మాత్రం పడగ విప్పుకుని, బుసలు కొడుతూ.. అట్లానే ఉండిపోయింది. దీంతో భాగ‌మ్మ భయంతో శ్రీశైలం మల్లన్న, జై మల్లీకార్చున అంటూ శివుడిని పదే పదే తలుచుకుంది. పదే పదే ఆ శివుని పేరు బిగ్గరగా జపం చేసింది..

అయితే.. ఆ దేవుడు అనుగ్రహించాడో మరేంటో కానీ.. ఆ పాము కాసేపు అక్కడే ఉండి, ఆ తర్వాత వెళ్లిపోయింది. ఇదంతా అక్కడ గట్టుమీద ఉన్నమరో బాలుడు రికార్డు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, నిజంగా ఆమెకు లక్ బాగానే ఉందని కొంత మంది.. ఆమెకు ఇది పునర్జన్మ అని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.

వీడియో కోసం www.prabhanews.comలో చూడండి

Advertisement

తాజా వార్తలు

Advertisement