Tuesday, May 14, 2024

బెంగాల్ అసెంబ్లీలో ఉద్రిక్త‌త : ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెండ్

ప‌శ్చిమ‌ బెంగాల్ లో అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బీర్‌భూం ఘటనపై చర్చ జరగాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. తోపులాట జరిగింది. ఈ సంంద‌ర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్షల్స్ అడ్డుకుంటున్నా.. ఇరుపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు. దీంతో స్పీకర్ బీజేపీకి చెందిన ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారిలో సువేందు అధికారి, మనోజ్ తిగ్గ, శంకర్ ఘోష్, దీపక్ బర్మన్, నరహరి మహతోలు ఉన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు సర్ది చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement