Tuesday, May 7, 2024

జ‌గ‌న్‌కు ఈనెల 31లోగా స‌మ‌న్లు అందించాలి : కోర్టు ఆదేశం

వైసీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కేసుపై ఈరోజు నాంప‌ల్లిలోని ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ విచార‌ణ సంద‌ర్భంగా జ‌గ‌న్ విచార‌ణ‌కు ఎందుకు హాజ‌రు కాలేద‌ని న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు. న్యాయ‌మూర్తి ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చిన ఏపీ ప్ర‌భుత్వ న్యాయవాది జ‌గ‌న్‌కు ఇంకా స‌మ‌న్లే అంద‌లేద‌ని తెలిపారు. దీంతో అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన న్యాయ‌మూర్తి ఈ నెల 31లోగా జ‌గన్‌కు స‌మ‌న్లు అంద‌జేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. అనంత‌రం విచార‌ణ‌ను వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement