Saturday, April 27, 2024

వ్య‌వ‌సాయ ఎగుమ‌తుల‌లో రెండో స్థానంలో తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రత్యేక రాష్ట్రం ఏర్పా టైన తర్వాత గడిచిన తొమ్మిదేళ్ళలో అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్న తెలంగాణ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల్లో టాప్‌-2గా నిలిచింది. వివిధ దేశాలకు ఉత్ప త్తులను ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా, రెండోస్థానం తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. నాణ్య మైన, నమ్మకమైన ఉత్పాదకత, ఉత్పత్తుల తయారీ రంగం లోనూ ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి ఎదిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ” వ్యవసాయ రంగం – ఉత్పత్తుల ఎగుమతు లు” అనే అంశంపై నిర్వహిం చిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అలాగే ఒక ప్పుడు పెద్దగా జలవనరులు లేని రాష్ట్రం.. ఇప్పుడు అత్యధిక సాగునీటి పథకాలతో వర్ధిల్లు తోంది. ఈ క్రమంలో విస్తీర్ణం, వనరుల వినియోగంలో గడిచిన రెండు, మూడేళ్ళ కాలంగా భారీగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులతో తెలంగాణకు ప్రత్యేక స్థానం దక్కింది.

తాజా లెక్కల ప్రకారం రాష్ట్రం నుంచి వ్యవసాయ ఎగు మతులు భారీగా పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమ తుల శాతం ఒక్కసారిగా 40శాతానికి పెరిగి, రూ.10వేల కోట్ల మార్కును దాటింది. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పురుగుదల కోసం చేసిన ప్రయత్నాలు, రైతులకిస్తున్న ప్రోత్సా హకాలు ఫలించాయి. ఒకప్పుడు చితికిన బతు కులతో అల్లాడిన రైతులను ఆర్ధికంగా ఆదుకోవ డానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం లో ఇంతలా సాగు పెరగడానికి రైతులు కూడా సాంకే తికత పద్ధతులను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం, వ్యవసాయ ఎగు మతుల్లో గణనీయమైన పెరుగుదలను చూపించిన రెండు రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర. కేవలం ఐదేళ్లలో ఊహిం చని ప్రగతిని సాధించాయి. అదే సమ యంలో వ్యాపార లావాదేవీలు 2017- 18 నుంచి 2021-22 వరకు తెలంగా ణ లో రూ.5,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు పెరిగాయి. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల సానుకూల సంకేతాల కోసం వ్యవసాయ ఎగుమతుల్లో 2020 నుంచి 2022 మధ్యకాలంలో దాదాపు 40శాతం పెరుగుదలను కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ గుర్తించింది. వ్యవసాయ ఎగుమతులు 2020-21లో రూ.6,337 కోట్లు- ఉండగా, అవి 2021-22లో దాదాపు రూ.10వేల కోట్లకు పెరిగినట్లు దృవీకరించింది. తెలంగాణ ఎగుమతుల్లో సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలు, పత్తి, మాంసం తదితర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. వినూత్న పద్ధతులు, సాంకేతికతను వేగంగా ఉపయోగించడం, కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాల కారణంగా తెలంగాణ నుండి ఎగు మతు లు పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలం గాణకు తీరప్రాంతం లేకపోయినప్పటికీ, వ్యవసాయ రం గం గణనీయంగా వృద్ధి చెందడానికి, మెరుగైన మౌలిక సదు పాయాలు ఎంతగానో దోహదపడ్డాయని స్పష్టం చేస్తున్నారు.

వ్యవసాయ ఆధారిత ఎగుమతుల్లో కేంద్ర గణాంకాల ప్రకారం, 2021-22లో పత్తి ఎగుమతులు మొత్తం రూ.3,055 కోట్లు- కాగా, సుగంధ ద్రవ్యాలు, టీ-, కాఫీలు రూ.1,936 కోట్లు-.గా ఉన్నాయి. అలాగే తృణధాన్యాలు రూ.1,480 కోట్లు-, మాంసం ఎగుమతులు రూ.268 కోట్లు-గా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొక్కజొన్న, బియ్యం, ద్రాక్ష, నిమ్మ, మామిడి, సోయాబీన్‌ ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తోంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టు-బడుల ప్రవాహంలో తెలంగాణ వాటా ఎక్కువగా ఉందని గణాంకాల ప్రకారం తెలుస్తుంది. 2019-2021 మధ్యకాలంలో రాష్ట్రం రూ.3,000 కోట్ల విలువైన ఎఫ్‌డిఐని ఆకర్షించింది. ప్రస్తుతం రాష్ట్రం నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది, ఇది ఎగుమతి స్థావరాన్ని మరింత మెరుగు పరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement