Sunday, April 28, 2024

Spl Story: వాహనాల్లో ట్రాకింగ్​ సిస్టమ్​.. యాక్సిడెంట్​ల నివారణకు టీఎస్​ఆర్టీసీ బస్సుల్లో ప్రయోగం

ప్రమాదాలను అరికట్టడం, యాక్సిడెంట్​ జరిగే సమయంలో డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కొత్తగా తీసుకొచ్చిన ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ ఆధారంగా హైదరాబాద్​ సిటీలోని పలు బస్సులు, ప్రయాణికులను చేరవేసే ప్యాసెంజర్​ మోటార్​ కార్లలో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్య కొన్ని బస్సుల్లో ఇన్​స్టాల్​ చేసిన ఈ కిట్​తో మంచి ప్రయోజనాలే ఉన్నాయని అధికారులు అంటున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

iRASTEలో భాగంగా ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని బస్సుల్లో అలారం వంటి అలర్ట్​ చేసే కిట్​ని అమర్చారు. IIIT-హైదరాబాద్, ఇంటెల్, INAI, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC).. UBER సహకారంతో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈ అతిపెద్ద సవాలును స్వీకరించించి పనిచేస్తునాయి. ఢీకొనే అవకాశం (యాక్సిడెంట్​ జరిగే ప్రమాదం) ఉన్నట్లయితే డ్రైవర్‌ను హెచ్చరించడానికి కీలకమైన పాయింట్ల వద్ద కొన్ని కెమెరాలు, అలర్ట్​ చేసే సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా డ్రైవర్ల కేబిన్‌లో అలారం, సెన్సార్, మూడు కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ కెమెరాల ద్వారా వచ్చిన ఫొటోలు ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ADAS సాంకేతికతలను ఉపయోగించి సిస్టమ్ అలారాన్ని అలర్ట్​ చేస్తుంది. సెంట్రల్ సర్వర్ కెమెరాలు, ఇతర కారకాల నుండి ఇన్‌పుట్ ఆధారంగా డ్రైవర్‌లకు ఇది కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఏటవాలు మలుపు వచ్చినప్పుడు వాహనదారుడిని హెచ్చరించడానికి బీప్ సౌండ్ వస్తుంది. అదేవిధంగా బస్సు, కదులుతున్న కారు మధ్య విభజన ఆధారంగా హెచ్చరిక అందుతుంది. డ్రైవర్ కనురెప్పలు కదిలే ప్రతిస్పందనగా మరొక హెచ్చరిక సౌండ్​ వస్తుంది.

- Advertisement -

టీఎస్‌ఆర్‌టీసీలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం సికింద్రాబాద్ డిపో నుండి హైవేలపై ప్రయాణించే 12 బస్సులలో అలారం సిస్టమ్‌లు ఏర్పాటు చేశారు. కచ్చితంగా ఇది అద్భుతమైన ఆలోచన. కొన్ని నెలల క్రితం ప్రారంభించిన ట్రయల్ ప్రాజెక్ట్ లో భాగంగా వచ్చే రెండు నెలల్లో 200 బస్సుల్లో ఈ పరికరాలను అమర్చనున్నారు. తెలంగాణ ఐటీ డిపార్ట్ మెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మూడు గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు.

డ్రైవర్‌లకు సహాయం చేయడంతో పాటు పరికరం ప్రమాదకరమైన లొకేషన్‌లు, డార్క్ ప్యాచ్‌లను గుర్తించడంలోనూ, విశ్లేషించడంలో సహాయపడవచ్చు. ఇంటెల్ పరిశోధనకు తమకు మద్దతు ఇస్తోందని ఒక అధికారి తెలిపారు. IIIT-హైదరాబాద్ కూడా దీని సాంకేతిక అంశాలను పరిశీలిస్తోంది. ఉబెర్ డ్రైవర్లకు ప్రాథమిక శిక్షణను అందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement