Saturday, January 22, 2022

తెలంగాణ ఖ్యాతిని దేశం నలుమూలలా చాటాలి..ఎంపీ..డా.జి.రంజిత్ రెడ్డి..

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మస్కు నరేందర్ కుమార్తె మస్కు నేహా, కోచ్ సుధాకర్ యాదవ్ మార్గ నిర్దేశనంలో.. న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది.ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి పిలిపించి, వారిని సత్కరించి, అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రీడల్లో సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. క్రీడాకారులు మన రాష్ట్ర ఖ్యాతిని దేశ నలుమూలల చాటాలని మస్కు నేహాకి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News