Sunday, April 28, 2024

Breaking: వరదనీటిని సద్వినియోగం చేసుకునేలా ప్లాన్​ చేయాలే.. అధికారులకు సీఎం కేసీఆర్​ ఆదేశాలు

తెలంగాణతోపాటు.. గోదావరి ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లన్నీ నిండాయి. గోదావరి బేసిన్‌లో దాదాపుగా నీటి వనరులు ఫుల్​ వాటర్​తో తొణికిసలాడుతున్నాయి. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవ్వాల (మంగళవారం) అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిని సమీక్షించి, వరద నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్లాన్​ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచనల మేరకు నీటిపారుదల శాఖ నీటి మట్టాలను ఎలా కాపాడుకోవాలి, రైతుల అవసరాలకు తగ్గట్టు ఎలా విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. తద్వారా వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు పనులు సాపీగా చేపట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.  ఇక.. నిజామాబాద్‌లోని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు, పోచారం, ఆదిలాబాద్‌లోని స్వర్ణ, కడెం, పెద్దపల్లిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో రైతుల నీటి అవసరాలు తీరుతాయని అధికారులు ధీమాగా ఉన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పిలో 90.31 టిఎంసిలకు గాను 74.83 టిఎంసిల నీటిమట్టానికి చేరుకోగా, మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 81,730 క్యూసెక్కులు ఉంది.

దీంతో అధికారులు తొమ్మిది గేట్లను ఓపెన్​ చేసి 86,118 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఫ్లడ్​ బులెటిన్​ ప్రకారం.. గోదావరి బేసిన్, సింగూరు ప్రాజెక్టులో 29 .91 టీఎంసీలకు 20.59 టీఎంసీలు, కడెం ప్రాజెక్టులో 7.60 టీఎంసీలకు 6.26 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీలకు 13.24 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. కాగా, ఆగస్టు చివరి నాటికి ఈ సీజన్‌లో పుష్కలంగా వర్సాలు కురిసే అవకాశం ఉండడంతో వానాకాలం సీజన్​కు రాష్ట్ర రైతులకు ఢోకాలేకుండా నీరు అందుబాటులోం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement