Wednesday, April 17, 2024

29న రిలీజ్​కు సిద్ధంగా ‘‘రామారావు ఆన్​ డ్యూటీ”.. అప్​డేట్​ ఇచ్చిన మూవీ మేకర్స్​

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ మాస్ మ‌హ‌రాజా రవితేజ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటన్నింటికీ డిఫ‌రెంట్ జోన‌ర్ లో ప‌లు స్క్రిప్ట్‌లు ఉన్నాయి. అయితే శరత్ మండవ దర్శకత్వం వహించిన ‘‘రామారావు ఆన్ డ్యూటీ’’ సినిమాలో రవితేజ తొలిసారిగా మండల రెవెన్యూ ఆఫీస‌ర్ గా (MRO) కనిపించనున్నాడు. కాగా, ఈ సినిమానా SLV సినిమాస్ LLP, RT టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

ఇక.. సినిమా ఈ నెల 29న విడుదలకు సిద్ధంగా ఉంది, ఈ క్ర‌మంలో మేకర్స్ తమ ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టిస్తూ కోత్త‌ ఎనౌన్స్ మెంట్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.. ఈ సినిమాలో రవితేజతో పాటు మజిలీ ఫేమ్ దివ్యషా కౌశిక్, రజిషా విజయన్, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, జాన్ విజయ్, చైతన్య కృష్ణ, శ్రీ, తనికెళ్ల భరణి, సురేఖా వాణి తదితరులు నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement