Thursday, May 9, 2024

High Court: మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడిపై హైకోర్టు సీరియస్​.. 50వేలు ఫైన్​!

పదే పదే కేసులు వేస్తూ.. ఆధారాలను చూపకుండా కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని ‘‘మా తెలంగాణ పార్టీ’’ అధ్యక్షుడు కె. వీరారెడ్డికి తెలంగాణ హైకోర్టు 50వేల రూపాయల ఫైన్​​ వేసింది. ఎంఏఏ తెలంగాణ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డిలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది.

బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్ యూనిట్లు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్స్ ను ఉపయోగించేందుకు.. వాటినుంచి విషపూరిత వ్యార్థాలను తీవ్రమైనవిగా పరిగణించేందుకు అనుమతించాలని కోరుతూ రిట్​ పిటిషన్​ దాఖలు చేశారు. ప్రతివాదుల నిర్ణయం ఏకపక్షం, చట్టవిరుద్ధం.. వ్యతిరేకమని మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కె వీరా రెడ్డి ఆ పిటిషన్​లో పేర్కొన్నారు. వాతావరణంలోకి వాయు కాలుష్యం, ద్రవ వ్యర్థాలను వెదజల్లుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే.. అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు ఏమిటని పిటిషనర్ తరఫు న్యాయవాది హర్ష్ కుమార్ అస్థానాను ప్రశ్నించారు. కాగా, మెటీరియల్ వాస్తవాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాచలేరు కదా అని ఈ సందర్భంగా CJ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇదే అంశంపై పిటిషనర్ మా తెలంగాణ పార్టీ అప్పీల్ బాడీ ముందు పలు అప్పీళ్లను దాఖలు చేయగా, ప్రాసిక్యూషన్ లేకపోవడంతో అవన్నీ కొట్టివేశారని ప్రతివాది ప్రభుత్వ అధికారులు కోర్టుకు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement