Friday, April 26, 2024

దళిత బంధుకు రూ.250 కోట్లు.. మరో నాలుగు మండలాల్లో అమలు

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని మరో నాలుగు మండలాల్లో అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సోమవారం రూ.250 కోట్లు విడుదల చేసింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలానికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం కింద.. ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించినప్పటికీ.. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో దీనిని అమలు చేశారు. ఆగస్టు 16ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లి-ఇందిరానగర్‌ వద్ద దళితబంధును ప్రారంభించారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు కోసం వెయ్యి కోట్లుపైనే విడుదల చేశారు. దళిత బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయంతో ఏమి చేయవచ్చే అనే దానిపై సర్కార్ సూచనలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 30 ఆర్థిక పథకాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ సర్కార్ కు షాక్.. హుజురాబాద్ లో దళిత బంధుకు బ్రేక్

Advertisement

తాజా వార్తలు

Advertisement