Saturday, April 27, 2024

TS: నేడు ఢిల్లీకి మంత్రుల బృందం.. వడ్ల కొనుగోలుపై కేంద్రమంత్రితో భేటీ

తెలంగాణ సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు యాసంగి వడ్లు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నది. రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్ గంగుల కమలాకర్‌, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి,  ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కూడిన మంత్రుల బృందం కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి వినతిపత్రం అందించనున్నది. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు సహా ఇతర ఎంపీలతో కలిసి మంత్రులు గోయల్‌తో సమావేశం కానున్నారు.

రబీ వరి ధాన్యం సేకరణ అంశంపై తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యుల బృందం ఢిల్లీకి వెళ్లి పంజాబ్‌, హర్యానాలో చేసినట్లుగా ఈ సీజన్‌లో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వరిని సేకరించాలని కోరనున్నారు. ఈ విషయంపై నిన్న కేసీఆర్ అధ్యక్షత టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో చర్చించిన అనంతరం ప్రకటించారు.  దేశంలో ఆహారధాన్యాలు సేకరించడం కేంద్రం బాధ్యత అని పేర్కొన్న ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాలకు భిన్నంగా ఉండకూడదని, దేశానికి ఒకే విధమైన ఆహారధాన్యాల సేకరణ విధానాన్ని తీసుకురావాలన్నారు. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement