Saturday, April 27, 2024

స్వాతిముత్యం స‌క్సెస్స్ అయ్యాడా..!

ఎంట‌ర్ టైన్మెంట్ చిత్రం స్వాతిముత్యం ద‌స‌రా సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ‌- పిఠాపురం ఎలక్ట్రసిటి డిపార్టమెంట్ లో జూనియర్ ఇంజినీర్ బాలమురళి (బెల్లంకొండ గణేష్). మంచి ఉద్యోగం, వయస్సు రావటంతో పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ భాగ్య లక్ష్మి (వర్ష బొల్లమ్మ) ను చూసి అమాంతం ప్రేమలో పడిపోతాడు. ఆమె ఓ స్కూల్ టీచర్. ఇద్దరి మధ్యా పెళ్లికు ముందు ప్రేమ నడుస్తూంటుంది. ఇక రేపో మాపో పెళ్లి అయినా ఏ ట్విస్ట్ లేకుండా హ్యాపీ…చివరకు పెళ్లి పీటల టైమ్ కి పెద్ద ట్విస్ట్. అదేమిటంటే…పెళ్లికి ముందు చేసిన ఓ పని..పిల్లాడి రూపంలో వచ్చి వెక్కిరిస్తుంది. దాంతో పెళ్లి ఆగిపోతుంది. మోసం చేసావంటూ భాగ్యలక్ష్మి, పరువు పోయిందని ఆమె తండ్రి (రావు రమేష్) గోలెత్తిపోతాడు. ఇంతకీ అసలు మ్యాటరేంటి..పెళ్లి కానీ ఈ కుర్రాడికి కొడుకు ఎక్కడ నుంచి వచ్చాడు. చివరకు ఈ సమస్యను ఎలా సర్దుకుని భాగ్యలక్ష్మిని తన దాన్ని చేసుకున్నాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ- నిర్మాత ముందే రివీల్ చేసినట్లు ఇది వీర్యదానం చుట్టూ తిరిగే కథ. స్నేహితుడు (వెన్నెల కిషోర్) బలవంతం మీద చేసిన వీర్యదానం చేస్తే అది , పిల్లాడి రూపంలో సమస్యగా మారి చుట్టుకుని, అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలాంటి కథలు హిందీలో ఇన్నాళ్లూ వస్తూండేవి. ఇప్పుడు మన కుర్రాళ్లకు సైతం అర్దమవుతున్నాయని అర్దం చేసుకుని ఈ ధైర్యం చేసినట్లున్నారు. సాధారణంగా హీరో వీర్య దాత అన‌గానే అంద‌రికీ హిందీ బ్లాక్‌బ‌స్ట‌ర్ విక్కీ డోన‌ర్‌యే గుర్తుకు వ‌స్తుంది. ఆయుష్మాన్ ఖురానాను స్టార్‌ను చేసిన సినిమా అది. ఆ సినిమా చేసే సమయానికి వీర్య దానం బాలీవుడ్ కు కొత్తే. ఎక్కడో హాలీవుడ్ లో వచ్చే టైమ్ సినిమా అన్నారు. ఈ సినిమా అంటే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. దీన్ని ప్రేక్ష‌కులు త‌ట్టుకోగ‌ల‌రా అనుకున్నారు. కానీ ఆ కాన్సెప్ట్‌ను వ‌ల్గారిటీ లేకుండా నీట్‌గా, హృద్యంగా, వినోదాత్మ‌కంగా చూపించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్నందుకున్నారు.

సినిమా ఎలా ఉందంటే–డైరక్టర్ గా లక్ష్మణ్ కొత్తవాడే కానీ క్లారిటీ ఉన్నవాడు అని అర్దమవుతోంది. కాకపోతే ఫస్టాఫ్ లో అసలు విషయంలోకి రాకుండా లాగడమే ఇబ్బంది అనిపిస్తుంది. అయితే గోదావరి జిల్లా ఫన్, సైటైర్స్ తో కాలక్షేపం చేసాడు. అలాగే కొన్నిచోట్ల ఎమోషన్స్ బలవతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. అలాంటివి ప్రక్కన పెడితే కొత్త హీరోతో,కొత్త దర్శకుడు సమర్దంవంతాగానే అవుట్ ఫుట్ తీసుకున్నాడనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. రన్ టైమ్ తక్కువ ఉంచటమే ఎడిటర్ ఈ సినిమాని పరుగెత్తించటానికి ఎంచుకున్న మార్గం అని అర్దం అవుతుంది. పాటలు రెండు బాగున్నాయి. సహజమైన లొకేషన్స్ సినిమాకు అందం తెచ్చాయి. పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన సినిమా అనే విషయం తెరపై కనపడే రిచ్ నెస్ గుర్తు చేస్తూంటుంది.

నటీనటులు …బెల్లంకొండ గణేష్ లో మంచి ఈజ్ ఉంది. అయితే సిద్దు జొన్నల గడ్డ ఈ పాత్ర చేస్తే బాగుండేది అని కొన్ని సార్లు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఫన్ ..చాలా వరకూ ప్లస్ అయ్యింది. హీరోయిన్ గా వర్ష ఎక్కవ తక్కువా కాకుండా చేసుకుంటూ పోయింది.రావు రమేష్..నరేష్, గొపరాజు రమణ ..కామెడీకి సాయిం పట్టారు. అలాంటి సీనియర్స్ వల్లే ఈ సినిమా ఇబ్బంది లేకుండా చూడగలుగుతాం. మొత్తానికి రెండు పెద్ద చిత్రాల మ‌ధ్య ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం అనేది గొప్ప విష‌యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement