Friday, April 26, 2024

బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ పై.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

సుప్రీంకోర్టు బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. 2002వ సంవత్సరంలో సామూహిక అత్యాచారం చేసి, కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని త్వరగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శనివారం కొట్టివేసింది. ఈ కేసులో 11 మంది నిందితులు 2008లో దోషులుగా తేలారు. దీంతో వారికి కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో 2008లో దోషులుగా తేలిన 11 మంది వ్యక్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి బయటికి వచ్చారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి కోర్టు అనుమతించింది. దీనిపై బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement