Saturday, April 27, 2024

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకి క‌రోనా

క‌రోనా సృష్టిస్తున్న క‌ల్లోలం అంతా ఇంతాకాదు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో సినీ సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతుండ‌టం క‌ల‌వ‌ర‌పెడుతోంది. రీసెంట్ గా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్వీట్ చేయ‌డం విశేషం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఇసో లేషన్ లో ఉన్నానని తెలిపారు. అలాగే గత కొద్దీ రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని కోరారు మహేష్. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే తిరిగి షూటింగ్ కు వెళ్లాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు మహేష్ బాబు. మహేష్‌కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement