Monday, May 6, 2024

Breaking: సన్‌రైజర్స్ ఈజీ విక్టరీ.. బెంగ‌ళూరుపై 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జ‌రిగిన‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఈజీగా విన్ అయ్యింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టును సన్‌రైజర్స్ బౌలర్లు క‌ట్ట‌డి చేయ‌డంతో 68 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టార్గెట్ చేర‌డంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (47) అద్భుతంగా ఆడటంతో సన్‌రైజర్స్ ఈజీగా మ్యాచ్ గెలిచింది. అతనితోపాటు ఓపెనింగ్ చేసిన విలియమ్సన్ (16 నాటౌట్) యాంకర్ రోల్ పోషించగా.. అభిషేక్ అవుటైన తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠీ (7 నాటౌట్) సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. దీంతో 8 ఓవర్లలోనే 72 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్థానానికి చేరింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement