Sunday, May 5, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఉక్రెయిన్ – ర‌ష్యాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొంత వ‌ర‌కు త‌గ్గాయ‌నే వార్త‌ల‌తో ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. దాంతో వారు కొనుగోళ్ల‌కు మొగ్గు చూపారు. దాంతో స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. దాంతో స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,736 పాయింట్లు లాభపడి 58,142కి ఎగబాకింది. నిఫ్టీ 509 పాయింట్లు పెరిగి 17,352కి చేరుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ (5.13), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.55), బజాజ్ ఫిన్ సర్వ్ (4.46), ఎల్ అండ్ టీ (4.11), టైటాన్ (4.02) టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement