Sunday, April 28, 2024

శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మంత్రి సబితారెడ్డి

మహేశ్వరం మండల పరిధిలోని పడమటి తాండ, ఉప్పు గడ్డ తాండలలో జరిగిన శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మాహారాజ్ 283వ జంయంతిని బంజారా సోదర సోదరీమణులు ఘనంగా జరుపుకుని వారు చూపిన మార్గంలో పయనించడం గొప్ప విషయమని కొనియాడారు. ఫలితం ఆశించని పనులు చేయాలని శ్రీ సేవాలాల్ మహరాజ్ గొప్పగా పిలుపునిచ్చారని గుర్తు చేశారు. బంజారా జాతికే కాదు యావత్ జాతికి ఆదర్శప్రాయులుగా నిలిచారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన తాండాలు, హరిజన వాడలు బాగుపడాలని ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకువచ్చి, వారి నిధులు పూర్తిగా వారికే దక్కేలా, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తున్నారన్నారు. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకలుగా బంజారా భవన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిర్మిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో బంజారా భవన్ కు స్థలం, నిధులు కేటాయించారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తి కావొస్తుందని సబితారెడ్డి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement