Monday, April 29, 2024

లాభాల‌తో ప్రారంభ‌మ‌యిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 59847.77 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17842.00 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ఇవాళ్టి నుంచి అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ప్రారంభంకానున్నది. ఫెడ్‌ సమావేశానికి ముందు సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 197 పాయింట్లు పెరిగి 31,020 వద్ద, నాస్‌డాక్ 87 పాయింట్లు లాభపడి 11,535 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్ల ర్యాలీ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 17,750 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు డౌ ఫ్యూచర్స్ 50 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో టాప్‌ గెయినర్స్‌ జాబితాలో బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఉన్నాయి. నిఫ్టీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, హీరో మోటాకార్ప్‌, ఐచర్‌ మోటార్స్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement