Wednesday, May 15, 2024

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు- స్థిరంగా వెండి ధ‌ర‌లు

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.45,850గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.50,120గా రికార్డయింది. బంగారం ధరలు తగ్గిన ఈ సమయంలో మాత్రం వెండి రేట్లు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ.62 వేలుగా ఉంది. గత మూడు రోజులుగా వెండి రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా పలుకుతున్నాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేట్లు తగ్గిపోయాయి. ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.46 వేలుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.50,170గా రికార్డయింది. ఢిల్లీలో కూడా వెండి రేట్లు స్థిరంగా కదలాడుతున్నాయి. కేజీ ధర అక్కడ రూ.56,700గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement