Sunday, May 5, 2024

వ‌రుస‌గా మూడోరోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడోరోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాల‌బాట‌ని ప‌ట్టాయి. ట్రేడింగ్ ప్రారంభ‌మైన త‌ర్వాత సూచీలు కాస్త త‌డ‌బ‌డినా మ‌ధ్యాహ్నం త‌ర్వాత పుంజుకుని లాభాల‌తో ముగిసాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 60,223కి పెరిగింది. నిఫ్టీ 120 పాయింట్లు ఎగబాకి 17,925 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, మెటల్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. బజాజ్ ఫిన్ సర్వ్ (5.09%), బజాజ్ ఫైనాన్స్ (4.44%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.70%), యాక్సిస్ బ్యాంక్ (2.56%), టాటా స్టీల్ 2.46% బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టెక్ మహీంద్రా (-2.87%), ఇన్ఫోసిస్ (-2.71%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.69%), విప్రో (-1.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.00%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement