Monday, May 6, 2024

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1041 పాయింట్లు లేదా 1.87 శాతం మేర వృద్ధి చెంది 56,858 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ 288 పాయింట్లు లేదా 1.73 శాతం బలపడి 16,930 పాయింట్ల వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెంపు, రూపాయి బలపడడం ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. ఫైనాన్షియల్, టెక్ స్టాకులపై కొనుగోలు ఆసక్తి చూపడంతో స్టాక్స్ భారీ లాభాల్లోకి వెళ్లాయి. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా దృఢంగా రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.84 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.85 శాతం మేర ఎగబాకాయి. బీఎస్ఈపై 1865 షేర్లు లాభపడగా.. 1389 షేర్లు నష్టల్లో ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement