Sunday, May 5, 2024

MUMBAI: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌మార్కెట్ల ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. మధ్యాహ్నం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఒకదశలో సెన్సెక్స్‌ ఏకంగా700 పాయింట్లు కుప్ప కూలింది. చివరికి సెన్సెక్స్‌ 651 పాయింట్ల నష్టంతో 59646 వద్ద, నిఫ్టీ 198 పాయింట్లు కుప్పకూలి 17758 వద్ద ముగిసింది. అలాగే తాజా నష్టాలతో సెన్సెక్స్‌ 60వేల దిగువకు, నిఫ్టీ కూడా 17800 దిగువకు పడిపోయింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.58 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.50 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.77 శాతం నష్టపోయింది. అలాగే ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ సెన్సెక్స్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement