Sunday, April 28, 2024

వ‌రుస‌గా రెండో రోజు న‌ష్టాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా న‌ష్టాల‌తో ముగిశాయి.ఆర్థికమాంద్యం భయాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ తీవ్రత మళ్లీ పెరగడం వంటి కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు నెగెటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మన ఇన్వెస్టర్లు కూడా అమ్మకాలకు మొగ్గుచూపారు. కాగా ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు నష్టపోయి 59,119కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 17,629కి పడింది. టైటాన్ (2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.64%), ఏసియన్ పెయింట్స్ (2.51%), మారుతి (1.68%), ఐటీసీ (1.19%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.80%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.18%), యాక్సిస్ బ్యాంక్ (-2.09%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.69%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.67%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement