Thursday, May 2, 2024

కాలేజ్ విద్యార్థుల ఘ‌ర్ష‌ణ – విద్యార్థిని ఢీ కొన్న కారు-వైర‌ల్ గా వీడియో

ఓ కాలేజ్ కి చెందిన రెండు స్టూడెండ్ గ్రూపుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. విద్యార్థులు ఒక‌రికొక‌రు రోడ్డుపై కొట్టుకుంటూ ఉండ‌గా ఒక కారు వేగంగా వారివైపు దూసుకువ‌చ్చింది.దాంతో ఆ విద్యార్థులు రోడ్డు పక్కకు పరుగులుతీశారు. అదుపుతప్పిన ఆ కారు ఒక విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో అతడు ఎగిరి ఆ కారుపై పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి జారి రోడ్డుపై పడ్డాడు. తిరిగి పైకి లేచిన ఆ విద్యార్థి చెంపలపై మరో విద్యార్థి కొట్టాడు. పోలీసులు రావడం చూసిన విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు.ఈ ఘర్షణకు దిగిన విద్యార్థుల్లో కొంత మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు ఘజియాబాద్‌ రూరల్‌ ఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు. విద్యార్థిని ఢీకొట్టిన కారును కూడా సీజ్‌ చేసినట్లు చెప్పారు. మిగతా విద్యార్థుల కోసం వెతుకుతున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement