Monday, May 6, 2024

లాభాల‌తో దూసుకుపోతోన్న స్టాక్ మార్కెట్స్

భారీ లాభాల‌తో దూసుకుపోతున్నాయి నేటి స్టాక్ మార్కెట్స్. దేశీయ స్టాక్‌ మార్కెట్లో మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 300 పాయింట్ల లాభంతో 59,791.32 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సైతం దాదాపు 80 పాయింట్ల పెరిగి 17,783.05 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల పవనాలు వీస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సైతం మూడున్నర నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. డౌ జోన్స్ డే కనిష్ఠ స్థాయి నుంచి 150 పాయింట్లు లాభపడగా, నాస్డాక్ దాదాపు 100 పాయింట్ల లాభంతో ముగిసింది. ఆసియా మార్కెట్లలో ఎన్‌సీఎక్స్‌ నిఫ్టీ 17,850 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు సైతం భారీగా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 94 డాలర్లకు పడిపోయింది. జూలై నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.01శాతం నుంచి 6.71శాతానికి తగ్గింది. గతవారంలో వచ్చిన కంపెనీల ఫలితాల ప్రభావం మంగళవారం మార్కెట్‌ కదలికలపై కనిపించనున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సెన్సెక్‌ 59,874 పాయింట్లు, నిఫ్టీ 17,820, నిఫ్టీ బ్యాంక్‌ 39,355.65 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. సెన్సెక్స్‌లో మారుతీ సుజూకీ, ఎషియన్‌ పేయింట్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, నిఫ్టీలో అదానీ పోర్ట్స్‌, ఐచర్‌ మోటార్స్‌, మారుతీ సుజూకీ, ఎస్‌బీఐ లైఫ్‌, హీరో మోటోకార్ఫ్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement