Saturday, May 4, 2024

మూడోరోజు లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వ‌రుస‌గా మూడోరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచుతున్న‌ట్లు ఆర్బీఐ నిర్ణ‌యించ‌డం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు లాభపడి 58,926కి చేరుకుంది. నిఫ్టీ 142 పాయింట్లు 17,606కి పెరిగింది. కన్జ్యూమర్ గూడ్స్ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ (2.11%), ఇన్ఫోసిస్ (1.80%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.77%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.64%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.60%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. మారుతి సుజుకి (-1.64%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.42%), నెస్లే ఇండియా (-0.38%) రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.21%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement