Thursday, June 1, 2023

శ్రీనగర్​​, లేహ్​ హైవే రీ ఓపెన్​.. వాహనాల రాకపోకలకు అనుమతి

కాశ్మీర్​ లోయ మీదుగా లడఖ్​ వరకు సాగే ఎత్తైన పర్వత మార్గం జోజిలా. ఇది సముద్ర మట్టానికి 3528 మీటర్ల  ఎత్తులో ఉంది. ఈ రహదారి లడఖ్​ ప్రజల మనుగడకు, ఆర్థిక అభివృద్ధికి అదేవిధంగా భద్రతా దళాలకు ఆయువుపట్టుగా ఉంది.  ఈ హైవేను కొంతకాలంగా క్లోజ్​ చేసి ఉంచారు. చలికాలంలో కురిసే మంచు.. భారీ హిమపాతం కారణంగా దాదాపు రెండు నెలల పాటు ఈ హైవేపై రాకపోకలు నిలిపేశారు.

కాగా, ఈ వ్యూహాత్మక శ్రీనగర్-లేహ్ హైవేపై ఇప్పుడు వాహనాల రాకపోకల కోసం తిరిగి ఓపెన్​ చేసినట్టు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లెఫ్టినెంట్​ జనరల్​ రాజీవ్​ చౌదరి తెలిపారు. ఈ ఏడాది జనవరి 5న భారీ హిమపాతం కారణంగా రహదారి మూసివేశామని, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కొంతకాలం పాటు ఓపెన్​  చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement