Sunday, March 26, 2023

Breaking: కర్నాటకలో బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు

కర్నాటకలోని తుమకూరు జిల్లా పలంకల్లి సమీపంలో ఇవ్వాల ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 8 మంది మృతి చెందగా, విద్యార్థులతో సహా 25 మంది గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను పావగడ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక వివరాల ప్రకారం బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement