Tuesday, May 14, 2024

ఒమిక్రాన్ కి ‘స్పుత్నిక్ బూస్ట‌ర్’ తో చెక్ : వెల్ల‌డించిన ర‌ష్యా

ఇప్ప‌టికే 75దేశాల‌కు పైగా విస్త‌రించింది ఒమిక్రాన్. ల‌క్ష‌ణాలు పెద్ద‌గా క‌నిపించ‌క‌పోయినా వ్యాప్తి మాత్రం చాలా తొంద‌ర‌గా వ్యాపిస్తోంది. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు వంద దాటాయి. కాగా ర‌ష్యా ఓ శుభ‌వార్త తెలిపింది. స్పుత్నిక్ రెండు డోసుల‌తో పాటు స్పుత్నిక్ లైట్ ను బూస్ట‌ర్ డోసుగా తీసుకుంటే క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ ని ఎదుర్కొవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. స్పు త్నిక్ లైట్ బూస్టర్ తీసుకున్న వారందరిలో రెండు నుంచి మూడు నెలల్లో యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేసింది రష్యా. ఇక నుంచి ప్రతి ఒక్కరు స్పు త్నిక్ బూస్టర్ ను వేసుకుంటే చాలా మంచిదని వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement