Monday, April 29, 2024

spirituality: ఇవ్వాల వెరీ వెరీ స్పెష‌ల్ డే.. కార్తీక పౌర్ణమి రోజే చంద్ర గ్రహణం..

పౌర్ణమిని చాలామంది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శివునికి ఇష్ట‌మైన రోజుగా భావిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈసారి వ‌చ్చిన‌ కార్తీక పౌర్ణమికి 580 సంవత్సరాల ప్రత్యేకత ఉంది అంటున్నారు పండితులు. పవిత్ర కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శివాలయాల్లో జ్వాలాతోరణాలు వెలుస్తుంటాయి. ఆకాశ దీపాలను వెలిగిస్తుంటారు భక్తులు.

అంతేకాకుండా శైవ, వైష్ణవాలయాలన్నీ దీపకాంతులతో క‌న్నుల‌పండువ‌గా ఉంటాయి. చాలామంది భ‌క్తులు ప్ర‌త్యేక‌ వ్రతాలు, పూజలు, నోములు చేస్తుంటారు. మహా శివుడికి లక్షబిల్వార్చన, లక్షవత్తులు, లక్షరుద్ర పూజలను కూడా నిర్వహిస్తారు. మహా శివరాత్రికి ఎంత ఇంపార్టెన్స్‌ ఉంటుందో.. అదే స్థాయిలో కార్తీక పౌర్ణమి రోజు కూడా తమ భక్తిని చాటుతారు. అయితే ఈసారి కార్తీక పౌర్ణమికి అతి ముఖ్యమైన ప్రత్యేకత ఉందంటున్నారు వేద పండితులు.

ఈరోజు (గురువారం) పాక్షిక చంద్రగ్రహణం మాత్ర‌మే కాకుండా సుదీర్ఘకాలం సాగే చంద్రగ్రహణం కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు. సుదీర్ఘకాలం సాగే చంద్రగ్రహణం (Moonar Eclipse) ఏర్పడటం దాదాపు 580 ఏళ్ల త‌ర్వాత‌ ఇదేనంటున్నారు శాస్త్రవేత్త‌లు. ఇండియాలోని అస్సోం, అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రమే ఈ పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం క‌నిపించ‌నున్న‌ట్టు చెబుతున్నారు.

గ్ర‌హణ కాలంలో చేయకూడని ప‌నులుంటాయా..?

అవును గ్ర‌హ‌ణం స‌మ‌యంలో చేయ‌కూడ‌ని ప‌నులుకూడా ఉంటాయంటున్నారు పండితులు. ఆ స‌మ‌యంలో ఫుడ్ తీసుకోవ‌డం వంటివి చేయ‌కూడ‌ద‌ని, నిద్ర పోకూడదని, గ్రహణం ఆరంభానికి ముందు వండిన ఆహార పదార్థాలు గ్రహణ కాలం ముగిసిన త‌ర్వాత తినొద్ద‌ని చెబుతున్నారు. విగ్రహాలు, యంత్రాలను పూజించే ఆచారం ఉన్నవారు పంచామృతంతో సంప్రోక్షణ చేయాలని చెబుతున్నారు. అయితే కొంత‌మంది వీటిని మూఢ న‌మ్మ‌కాల‌ని కొట్టిపారేసే వారు కూడా ఉన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement