Monday, April 29, 2024

Special Story – గులాబీల ప్ర‌చారంపై బాస్ నిఘా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భారాస ప్రచారంలో హోరెత్తిస్తోంది. మూడోసారి అధికారమే లక్ష్య ంగా దూసుకువెళ్తోంది. క్షేత్రస్థాయిలో అభ్య ర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. బీ ఫామ్‌లు అందుకున్న వారంతా సొంత నియోజకవర్గాల్లో హడావుడి కొనసాగిస్తున్నారు. అంతా బాగున్నా అధినేత ఆదేశాలను మాత్రం అభ్యర్థులు పక్కన పెడుతున్నారు. అసమ్మతి నేతలను కలుపుకొని పోవడంలో ఇంకా వెనబడే ఉన్నారు. ప్రచారంలో వారికి ప్రాధాన్యతను ఇవ్వకపోడంతో ప్రతిపక్ష పార్టీలకు అవకాశంగా మారుతోంది. ఓట్ల రూపంలో భారాసకు దెబ్బపడే అవకాశం ఉంది. అది ప్రత్యర్థులకు కలిసి రాబోతుంది. సీఎం కేసీఆర్‌ గర్వాన్ని పక్కన పెట్టాలని హెచ్చరించినా అభ్యర్థుల తీరులో మార్పు రావడం లేదు. దీన్ని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఉపయోగించుకోవా లన్న ఆలోచనలో పడ్డాయి. ఇప్ప టికే కొంతమంది నేత లతో చర్చలు జరుపుతు న్నారు. సొంత పార్టీ నేతల నుంచి పిలుపు రాకపోవడంతో ప్రత్య ర్థులతో చేతులు కలిపే పరిస్థితు లను అభ్యర్థులే కొని తెచ్చుకుంటున్నా రని గులాబీ వర్గాలు పేర్కొన్నాయి.

అభ్యర్థుల తీరే ప్రత్యర్థులకు వరమా..?
తెలంగాణలోని అన్ని స్థానాల్లో భారాస నుంచి టికెట్‌ కోసం సిట్టిం గ్‌తో పాటు మరో ఇద్దరు లేదా ము గ్గురు నేతలు తీవ్రంగా ప్రయత్నిం చారు. అధినేత కేసీఆర్‌ సిట్టింగ్‌లకే మళ్లి అవ కాశం ఇవ్వడంతో టికెట్‌ ఆశించిన వారు మొ దట్లో కాస్త అసమ్మతిని వెళ్లగక్కినా ఇప్పుడు పార్టీ లైన్‌లో పని చేసుకుంటున్నారు. అభ్యర్థులు మాత్రం ఇప్పటికీ టికెట్‌ ఆశించిన వారిని కలుపు కొని పోవడంలో వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా వారికి ప్రాధాన్యతను ఎందుకు ఇవ్వాలని, గెలుపు మాదేనన్న ధీమాతో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి, ఆలేరు, కోదాడ, నాగార్జునసాగర్‌, మునుగోడు, నల్గొండ, నకిరేకల్‌ స్థానాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్‌లో హుజూరాబాద్‌, చొప్పదండి, మానకొండూరు, వేములవాడ స్థానాల్లో అభ్య ర్థులు కలుపుకొని పోవడం లేదన్న అభిప్రా యాన్ని అక్కడి నేతలు వెల్లడిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మహబూబ్‌నగర్‌, కల్వకుర్తి, వనపర్తి, మఖ్తల్‌, జడ్చర్లతో పాటు మరో ఒకటి రెండు స్థానాల్లో గ్రూపులుగా విడిపోయారు. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, పరిగి, శేరి లింగంపల్లి, ఉప్పల్‌, కూకట్‌పల్లిలో వర్గాలుగా మారిపోయారు. పార్టీ లైన్‌లో పని చేస్తున్నా అభ్యర్థులు అసంతృప్తులను పిలవకపోవడంతో సైలెంట్‌ అవుతున్నారు. హైదరాబాద్‌లో కంటో న్మెంట్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట్‌ స్థానాల్లో అభ్య ర్థులతో కలిసి టికెట్‌ ఆశావహులు ప్రచారంలో పాల్గొనడం లేదు. తమను ప్రచారానికి పిలవడం లేదని, పిలవని పేరంటానికి ఎలా వెళ్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌చార్జ్‌ల తీరు.. అభ్యర్థులకు తంటాలు
భారాస అభ్యర్థులకు కొత్త తలనొప్పులు పుట్టుకొస్తున్నాయి. ఒక వైపు అసమ్మతి నేతలు, మరో వైపు కొత్తగా వచ్చిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా మారింది. ఇన్‌చార్జ్‌లు కొంత మంది అభ్యర్థులకు తంటాలను తీసుకువస్తు న్నారు. లేని పోని ఘర్షణలకు కారణమవుతు న్నారు. ఉన్న కష్టాలకు పోను కొత్తగా అభ్యర్థులకు ఇన్‌చార్జ్‌లు సమస్యలను తీసుకు వస్తున్నారు. లీడర్‌కు, క్యాడర్‌కు మధ్య దూరా న్ని పెంచేలా ఇన్‌చార్జ్‌ల ఒంటెద్దు పోకడలు ఉంటున్నాయి. ఉప్పల్‌ నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌ వర్సెస్‌ కార్యకర్తలుగా సీన్‌ మారింది. కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఇన్‌చార్జ్‌ శ్రీధర్‌ రెడ్డిపై ఉప్పల్‌, ఏఎస్‌ రావునగర్‌, చెర్లపల్లి డివిజెన్‌ పార్టీ శ్రేణులు ఆందోళన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీసీల ను అణగదొక్కుతున్నారని, మొత్తం రెడ్డి రాజకీ యం చేస్తున్నారంటూ అభ్యర్థి లక్ష్మారెడ్డి, ఇన్‌ చార్జ్‌ శ్రీధర్‌ రెడ్డిల తీరుపై నిలదీశారు. భారాసకు అక్కడ బీసీలు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క ఉప్పల్‌లోనే ఉన్న పరిస్థితి కాదు. పలుచోట్ల ఇలాంటి గొడవలే జరుగుతు న్నాయి. అధిష్టానం ఎంత సీరియస్‌గా చెప్పినా కొన్ని చోట్ల పద్ధతి మార్చుకోకపోవడం పార్టీకి మైనస్‌గా మారుతోంది. ఇలాంటి కొన్ని స్థానా లకు సంబంధించిన రిపోర్ట్‌లు అధినేత వద్దకు చేరినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

మార్చేందుకు వెనకాడే ప్రసక్తే లేదు
భారాస అధినేత కేసీఆర్‌ తీరు మార్చుకొని అభ్యర్థుల విషయంలో గట్టి షాక్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అవకాశాలు ఇచ్చినా, పార్టీ టికెట్‌, బీ ఫామ్‌ ఇచ్చినా ఇంకా వెనకబడి ఉంటే చివరి నిమిషంలో చూస్తూ ఊరుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. గెలుపు ఛాన్స్‌ లేని చోట్ల అభ్యర్థులను మార్చనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి రోజు వార్‌ టీమ్‌ 119 నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్‌లను అధినేతకు అందిస్తున్నారు. సర్వేలు సైతం కొనసాగుతున్నాయి. ఇంటెలీజెన్స్‌ రిపోర్ట్‌లు, సర్వేలు, పార్టీ నివేదికలన్ని చూసిన తర్వాత తీరు మార్చుకోని వారిని మార్చేందుకు వెనకాడే ప్రసక్తే లేదని అంతర్గత సమావేశంలో కొంత మందికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement