Thursday, May 9, 2024

Mission Gagan yaan – గగన్ యాన్ మిషన్ టెస్ట్ ప్రయోగం సక్సెస్

గగన్ యాన్ మిషన్ టీవీ డీ-1 టెస్ట్ ప్రయోగం సక్సెస్ అయింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 (టెస్ట్ వెహికల్ డెమాన్ స్ట్రేషన్ 1) ను శనివారం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. క్రూ మాడ్యుల్ ప్రయోగంలో భాగంగా సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ను నింగిలోకి పంపింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ 17 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ‘అబార్ట్’ సంకేతం పంపారు. దీంతో రాకెట్ లోని క్రూ ఎస్కేప్ వ్యవస్థ యాక్టివేట్ అయింది. రాకెట్ నుంచి విడివడి పారాచూట్ సాయంతో సముద్రంలో ల్యాండ్ అయింది. ప్రయోగం ఆద్యంతం అనుకున్నట్లుగానే కొనసాగిందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ వివరించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ అభినందనలు తెలిపారు.

ముందుగ. గగన్ యాన్ మిషన్ టీవీ డీ-1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని ఇస్రో హోల్డ్ లో పెట్టింది. చివరిక్షణంలో కౌంట్ డౌన్ ను హోల్డ్ చేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాంకేతిక లోపం సరి చేసి 10 గంటలకు నింగి లోకి పంపారు. విజయ వంతగా ప్రయాగం జరిగిందని ఇస్రో ప్రకటించింది.

కాగా ,. ఇస్రో మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్ యాన్ టెస్ట్ వెహికల్ టీవీ-డీ1ప్రయోగానికి నిన్న సాయంత్రం 7.30 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగించాలని భావించారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావించారు. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించాలని అనుకున్నారు

కానీ, సాంకేతిక కారణాల వల్ల 30 నిమిషాలు ఆలస్యంగా 8.30 గంటలకు గగన్ యాన్ ను ప్రయోగించాలని భావించారు. మళ్లీ గగన్ యాన్ మిషన్ టీవీడీ-1 ప్రయోగం సమయంలో స్వల్ప మార్పు చేశారు. సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగించాలనుకున్నారు. అయితే, మరోసారి గగన్ యాన్ టెస్ట్ లాంచ్ లో సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో చివరి క్షణంలో కౌంట్ డౌన్ ను శాస్త్రవేత్తలు హోల్డ్ చేశారు. ఆ తర్వాత 10 గంటలకు ప్రయోగించారు.. మానవ సహిత ప్రయోగానికి ముందు క్రూ ఎస్కేప్ పరీక్ష. గగన్ యాన్ ప్రయోగంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి చేర్చే ఘట్టంలో ఏదైనా అవాంతరం చోటు చేసుకుంటే క్షేమంగా వారు తప్పించుకోవడానికి ఈ క్రూ ఎస్కేప్ సిస్టం ఉపయోగపడనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement