Friday, May 3, 2024

‘స‌న్ ఆఫ్ ఇండియా’ రిలీజ్ డేట్ ఎనౌన్స్

డైరెక్ట‌ర్ డైమండ్ ర‌త్న‌బాబు డైరెక్ష‌న్ తో పాటు క‌థ‌ని అందించిన చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా. ఈ చిత్రంలో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, పృద్ధ్వీ రాజ్, రఘు బాబు వంటి సీనియర్ నటులు పలు పాత్రలలో న‌టించారు. ఇళయరాజ సంగీతం, మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో చిత్రం మరింత ఆకర్షణీయంగా ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పై మూవీ మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు. ఫిబ్రవరి 18న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ డేట్ పోస్టర్ ను అధికారికంగా విడుదల చేశారు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల కంటే ముందే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement