Thursday, May 16, 2024

ఓ చేతిలో సిగ‌రేట్ – మ‌రో చేతిలో పాము – ఆమె ధైర్యానికి హాట్యాఫ్

ఈ మ‌ధ్య‌కాలంలో పాముల‌ని అల‌వోక‌గా ప‌ట్టేస్తున్నారు అమ్మాయిలు. వారి థైర్యం చూస్తే మ‌న‌కు గుండె ఆగాల్సిందే. కాగా రీసెంట్ గా ఓ అమ్మాయి అత్యంత ఈజీగా పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రోడ్డు మధ్యలో ఓ పాము చుట్టుకుని ఉంది. అప్పుడే అక్కడికి ఓ యువతి వచ్చింది. చేతిలో సిగరెట్ పట్టుకుని.. కూల్‌గా.. ఇంకో చేతితో పామును తల దగ్గర పట్టుకుంటుంది. ఆ తర్వాత రెండు చేతులతో దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న మొక్కలలో పడేస్తుంది. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ పామును పట్టుకున్న యువతి పేరు జాక్వలిన్ అట‌. ఈ వీడియోను ‘unilad’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీనికి 78,851 లైకులు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement