Sunday, April 28, 2024

స్మార్ట్ ఫోన్స్ పేల‌డానికి కార‌ణాలు ఎన్నో..

ఈ మ‌ధ్య‌కాలంలో స్మార్ట్ ఫోన్స్ పేలుతున్న వార్త‌ల‌ని త‌ర‌చుగా వింటున్నాం. అస‌లు ఫోన్లు పేల‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటో తెలుసుకుందాం.. స్మార్ట్‌ఫోన్ యూజర్ల అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు పేలిపోవడానికి ప్రధాన కారణాలు బ్యాటరీకి సంబంధించినవే. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు కఠినమైన భద్రతా పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాయని చెప్పినప్పటికీ, ఫోన్లు పేలుతున్నట్లు అప్పుడప్పుడు నివేదికలు వస్తున్నాయి. అయితే ప్రతిసారీ స్మార్ట్‌ఫోన్ పేలి మంటలు చెలరేగడానికి తయారీదారుల తప్పు కారణం మాత్రం కాదని మనం గుర్తుంచుకోవాలి. స్మార్ట్‌ఫోన్ పేలిపోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం బ్యాటరీ లోపమే. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లలో లియాన్ బ్యాటరీలతో రూపొందించబడతాయి. ఇవి కెమికల్ బ్యాలెన్స్‌ను కలిగి ఉండాలి. వీటి దగ్గర వేడి పెరిగినప్పుడు లేదా వాటి కేసింగ్ దెబ్బ తిన్నట్లయితే స్మార్ట్‌ఫోన్ పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లో ఉండే బ్యాటరీలు హీట్ అవుతున్నాయంటే చాలా ప్రమాదకరమని గుర్తించాలి. ముఖ్యంగా వేడి ఉండే ప్రదేశాల్లో ఫోన్‌ను ఛార్జ్ చేయడం లేదా బ్యాటరీని రాత్రిపూట ఛార్జ్ చేయడానికి వదిలేయడం వల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కుతుంది. ఛార్జింగ్ సమయంలో బ్యాటరీని ఫోన్‌కాల్స్ లేదా ఇతర అవసరాలకు ఉపయోగించినప్పటికీ, బ్యాటరీ వేడెక్కే అవకాశం ఉంది.

ప్రతి స్మార్ట్‌ఫోన్ బ్యాటరీకి నిర్దిష్ట ఛార్జింగ్ సైకిల్ ఉంటుంది. లియాన్ బ్యాటరీల విషయంలో, ఛార్జింగ్ ముగిసిన తర్వాత కూడా అలాగే ఉంచితే బ్యాటరీ హీటెక్కి త్వరగా ఉబ్బుతుంది. ఇలా ఉబ్బిన బ్యాటరీలు పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఉబ్బిన బ్యాటరీలను మీరు గమనించినట్లయితే వెంటనే వాటిని మార్చండి. ఫోన్ చేతిలో కింద పడిపోయినప్పుడు బ్యాటరీ ఉబ్బినట్టు అనిపిస్తే, దాన్ని మార్చేయండి.స్మార్ట్‌ఫోన్లో కనిపించే డ్యామేజీ లేనప్పటికీ మీ ఫోన్లు తరచుగా కింద పడిపోతే, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ సడెన్ కింద పడినప్పుడు బ్యాటరీ భాగాలు బాగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఇతర సెక్యూరిటీ భాగాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కూడా స్మార్ట్‌ఫోన్ పేలిపోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement