Friday, May 3, 2024

త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ ఫొటోల‌ని పోస్ట్ చేసిన.. ర‌ష్మీ

త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ లో రెచ్చిపోయింది యాంక‌ర్..న‌టి ర‌ష్మీ ..ఈ మేర‌కు త‌న ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పార్టీలో ఫ్రెండ్స్ తోపాటు ఎంజాయ్‌ చేసింది రష్మి గౌతమ్‌. మెడలో గోల్డ్ కలర్‌ దండ ధరించి రెచ్చిపోయింది. ఫ్రెండ్స్ తో కలిసి చిందులేసింది. కొంటె పనులు, చిలిపి పనులు చేసింది. కొంటెగా ఫోటోలకు పోజులిచ్చింది. డాన్సులు, ముద్దులతో నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేసిందీ జబర్దస్త్‌ యాంకర్‌. ప్రస్తుతం ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది రష్మి గౌతమ్‌. ఇందులో బ్లూ టాప్‌ ధరించింది రష్మి గౌతమ్‌. మోకాళ్ల పైకున్న టాప్‌లో తన థైస్‌ అందాలను చూపించింది. రాత్రి సమయంలో చాలా హాట్‌గా ఉంది రష్మి. ఆయా పిక్స్ నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

ఈ సందర్భంగా రష్మి ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో రష్మి చెబుతూ, ఉండాలనుకునే వారికి కట్టుబడి ఉండండి, వెళ్లాలనుకునే వారిని వదిలేయండి, నా ఉనికికి మరో ఏడాది యాడ్‌ అయ్యింది. దానికి విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తాను. బర్త్ డేని స్పెషల్‌గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నాజీవితంలో మూడు ప్రధాన స్తంభాలు, నిజంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని పేర్కొంది రష్మి గౌతమ్‌. దీంతో నెటిజన్లు కూడా బర్త్ డే విషెస్‌తోపాటు కామెంట్లు చేస్తున్నారు. క్యాప్షన్‌ బాగుందని, కరెక్ట్ గా చెప్పారని, ఇప్పుడు కొన్ని నిజాలు జీర్ణించుకోలేని విధంగా ఉంటాయి. క్వీన్‌ ఆల్వేస్‌ క్వీన్‌ అని అంటున్నారు. రాత్రి రెచ్చిపోయావా? అంటూ కొందరు కొంటెగా కామెంట్లు పెడుతుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement