Friday, May 3, 2024

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై – జులై 1నుంచి నిషేధం

జులై 1నుంచి ప్లాస్టిక్ పై నిషేధం అమ‌లుకానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి స్వ‌స్తి ప‌లికేందుకు ప్ర‌భుత్వం త‌గినంత స‌మ‌యం ఇచ్చింద‌ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ అన్నారు.ఒక‌సారి వినియోగించగిలిగే ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని గతంలో పలుమార్లు హెచ్చరించామన్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగంపై జులై 1 తేదీపై నిషేధం అమల్లోకి వస్తుంది. పాలీస్టైరిన్, పాలీస్టైరిన్ సంబంధిత వస్తువులపై నిషేధం ఉంది. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు ఉత్పత్తుల జాబితాలో.. బెలూన్ల ప్లాస్టిక్ స్టిక్ లు, ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, క్యాండీ స్టిక్స్, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ గ్లాసులు ప్రధానమైంది. వీటితో పాటు 100 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ స్పూన్ లు, పోర్కులు ఇకపై కనిపించవు. అలాగే, స్వీట్ బాక్స్ లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇన్విటేషన్ కార్డులపై అలంకరణ కోసం వాడే వ్రాపింగ్ ప్లాస్టిక్ ఫిల్మ్ లు కూడా నిషేధిత జాబితాలో చేర్చ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement