Saturday, May 4, 2024

‘స‌న్ ఫిష్’ : ఒకేసారి 30కోట్ల గుడ్లు పెట్ట‌డం దీని ప్ర‌త్యేక‌త‌

స‌ముద్రంలో ఎన్నో ర‌కాల చేప‌లు ఉంటాయి. అయితే వాటిల్లో కొన్నింటికి మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే చేప కూడా అలాంటిదే. అయితే ఈ ర‌కం ఆడ‌చేప ఒకేసారి 30కోట్ల గుడ్లు పెట్ట‌డం విశేషం. అంతేకాదు ఈ చేప క‌ళ్లు చాలా పెద్ద‌విగా మెరుస్తూ ఉంటాయ‌ట‌. అయితే ఇటువంటి చేప రీసెంట్ గా కాలిఫోర్నియాలోని లాగునా బీచ్ లో క‌నిపించింద‌ట‌. ఈ చేప‌ని చూసిన ఓ వ్య‌క్తి ఇదేం చేప ఇలా ఉంద‌ని ఆశ్చ‌ర్య‌పోయాడ‌ట‌. ఆ చేప ముద్దలా కనిపిస్తోంది.. అది తెల్లగా.. ఉంది. దాదాపు 9 నుంచి పది అడుగుల పెద్దగా ఉంది.

దాంతో ఆ చేపకి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు బయటికొచ్చాయి. దాని పేరు సన్‌ఫిష్. ఎందుకంటే… అది ఎక్కువగా… సముద్ర నీటిపైన తేలుతూ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే సన్ బాత్ చేస్తూ ఉంటుంది. అలా ఉండటం ఆ చేప‌కి ఇష్టం.ఈ చేపలు తెలుపు, బూడిద రంగు, బ్రౌన్, గోల్డెన్ కలర్స్‌లో ఉంటాయి. దీన్ని మోలామోలా చేప అని కూడా అంటారు. ఈ భూమిపై బరువైన ముళ్లు కలిగిన రెండు చేపల్లో ఇది ఒకటి.ఈ చేప తల .. రెక్కలు పెద్దవి. ఒక్కోసారి ఈ చేపల్ని షార్ చేప అని భ్రమపడుతుంటారు. రెక్కలు లేకపోతే… వీటిని చూసిన వాళ్లు బండరాయి అనుకుంటారు. అలా ఉంటాయి వీటి ఆకారం.

కాగా అక్టోబర్‌లో ఇలాంటి 10.5 అడుగుల చేప వలకు చిక్కింది. అది 2000 కేజీల బరువు ఉంది. డిసెంబర్ 2న కనిపించిన తాజా చేప… చాలా సైలెంటుగా ఉంది. చాలా సందర్భాల్లో ఈ చేప రాయిలా కనిపిస్తుంది. దీని ఆకారం అలా ఉంటుంది. ఈ చేపలు పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాల్లోనే ఉంటాయి. వీటిని వేటాడి… జపాన్, కొరియా, తైవాన్ లాంటి దేశాలకు పంపిస్తున్నారు. అక్కడ ఈ చేపల్ని బాగా తింటారు.ఈ చేపలు జెల్లీ ఫిష్, స్క్విడ్ లాంటి వాటిని తింటాయి. ఐతే… వీటిలో పోషకాలు తక్కువ కావడంతో… పోషకాల కోసం ఈ చేపలు ఎక్కువ ఆహారం తింటాయి. ఈ చేపలు స్క్వేర్ లాగా ఉంటాయి. ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపిస్తాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement