Thursday, May 9, 2024

శ్యామ్ సింగ‌రాయ్ ట్రైల‌ర్ : రెండు పాత్ర‌ల్లో అద‌ర‌గొట్టిన నాని

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం శ్యాం సింగ‌రాయ్. ఈ చిత్రం నుండి ట్రైల‌ర్ రిలీజ్ అయింది. రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి డైరెక్ట‌ర్. కాగా నిహారిక ఎంట‌ర్టైన్మెంట్ ప‌తాకంపై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీని డిసెంబర్ 24న రిలీజ్ చేయ‌నున్నారు. కాగా ఈ ట్రైలర్ లో వాసు అనే క్యారెక్టర్ పోషిస్తున్నట్టు నానిని చూపించారు. ఫిలిం డైరెక్టర్ అవ్వడం కోసం సాఫ్ట్ వేర్ జాబ్ కూడా వదులుకొని తన గోల్ ని అచీవ్ అవ్వాలనుకునే పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. హీరోయిన్ కృతిశెట్టితో రొమాంటిక్ కిస్ సీన్ ను కూడా ట్రైలర్ లో చూపించారు.

అనంత‌రం శ్యామ్ సింగరాయ్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ప్రజల కోసం పోరాడుతూ.. దేవదాసితో ప్రేమలో పడే క్యారెక్టర్ లో అదిరిపోయాడు నాని. ఇక దేవ‌దాసిగా సాయిప‌ల్లవి మెరిసింది. తప్పని తెలిసాక దేవుడిని అయినా ఎదిరించడంలో తప్పే లేదు అనే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ లో కనిపించిన సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని బాగా ఎలివేట్ చేసింది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యదేవ్ జంగా కథ అందించిన ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement