Sunday, May 5, 2024

హెచ్​డీఎఫ్​సీ కస్టమర్లకు షాక్​.. అకౌంట్లలో కోట్లకొద్ది డబ్బులు జమ

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు అకౌంట్​ ఉన్న వారి ఖాతాల్లో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నగదు జమ అయ్యింది. వికారాబాద్​ జిల్లాకు చెందిన బిజినెస్​ మన్​ వెంకట్​రెడ్డి ఖాతాలో దాదాపు 18.52 కోట్లు జమ అయ్యాయి. దీంతో షాక్​ తిన్న అతను బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే వందలాది మంది అకౌంట్లలో ఇట్లాగే పెద్ద మొత్తంలో నగదు జమ అయినట్టు తెలుస్తోంది. తమిళనాడులోనూ ఇట్లాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కరి అకౌంట్లలో 13.5 కోట్ల రూపాయలు జమ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇదంతా సాఫ్ట్​వేర్​ అప్​డేషన్​తో ఇట్లా జరిగిందని బ్యాంకు అధికారులు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement