Tuesday, May 7, 2024

ఎలాన్ మ‌స్క్ కి షాక్.. ఒక్క‌రోజే రూ.63వేల కోట్లు న‌ష్టం

అమెరికా స్టాక్ మార్కెట్ లో టెస్లా షేర్ల‌కి ఎదురుదెబ్బ త‌గిలింది. టెస్లా షేర్ల ధరలు అమ్మకాల ఒత్తిడితో పతనం కావడంతో ఎలాన్ మస్క్ భారీగా నష్టపోయారు. ఒక్కరోజే మస్క్ సంపదలో రూ.63.72 కోట్లు తరిగిపోయాయి. అక్టోబరు తర్వాత టెస్లా షేర్ల ఈ స్థాయిలో కుదుపులకు గురికావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నారు. ప్రథమస్థానంలో ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు.

మస్క్ సంపద 148 బిలియన్ డాలర్లు కాగా, ఆర్నాల్ట్ సంపాదన 161 బిలియన్ డాలర్లు. మస్క్ ఆస్తుల్లో అత్యధికం టెస్లా సంస్థలో స్టాక్స్/ఆప్షన్స్ రూపంలోనే ఉన్నాయి. ఇటీవల ఆయన ట్విట్టర్ ను హస్తగతం చేసుకోగా, అందుకు అందుకు అవసరమైన నిధుల కోసం 3.58 బిలియన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు. ట్విట్టర్ విషయంలో మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా టెస్లా షేర్లపై ప్రభావం చూపుతున్నట్టు ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement