Tuesday, May 7, 2024

రిప‌బ్లిక్ డే ప‌రేడ్ లో ఆక‌ట్టుకున్న శివాంగీ సింగ్ – ఆమె ఎవ‌రో తెలుసా

నేడు జ‌రిగిన గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో భాగంగా రాజ్ ప‌థ్ లో నిర్వ‌హించిన ప‌రేడ్ లో భార‌త‌వైమానిక దళ శ‌క‌టానికి ప్లైట్ లెప్టినెంట్ అయిన , రాఫెల్ ను న‌డిపిన తొలి మ‌హిళా పైలెట్ శివాంగీ సింగ్ ప్రాతినిధ్యం వ‌హించ‌డం విశేషం. ఈ శ‌క‌టానికి స్క్వ‌డ్ర‌న్ లీడ‌ర్ ప్ర‌శాంత్ స్వామినాథ‌న్ నేతృత్వాన్ని వ‌హించారు. ఇక శ‌క‌ట ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 8 అడ్డు వరుసలు, 12 నిలువు వరుసల్లో పరేడ్ చేశారు. శకటంపై రాఫెల్ యుద్ధ విమానం, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్, త్రీడీ సర్వీలెన్స్ రాడార్ ఆశ్లేష ఎంకే 1ల నమూనాలను ఏర్పాటు చేశారు.

పాకిస్థాన్ తో 1971 యుద్ధంలో కీలక భూమిక పోషించిన మిగ్ 21 యుద్ధ విమనాన్నీ ప్రదర్శించారు. కాగా, శివాంగి కంటే ముందు రిపబ్లిక్ డేలో ఎయిర్ ఫోర్స్ శకటానికి భావనా కాంత్ ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఎయిర్ ఫోర్స్ శకటానికి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా పైలెట్ గా ఆమె నిలిచారు.రాఫెల్ కు పైలెట్ గా ఎంపికవడానికి ముందు ఆమె మిగ్ 21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపారు. వారణాసికి చెందిన ఆమె.. పంజాబ్ లోని అంబాలాలో ఉన్న వైమానిక దళ గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ లో సభ్యురాలు. 2020లో ఆమె తొలిసారి రాఫెల్ ను నడిపారు. ఎంతో కఠోరమైన శిక్షణ తర్వాత శివాంగిని రాఫెల్ పైలెట్ గా ఎంపిక చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement