Tuesday, May 21, 2024

మెగాస్టార్ చిరంజీవికి కరోనా.. త్వరగా కోలుకోవాలన్న ఎన్టీఆర్

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. చిరంజీవికి కరోనా రావడంతో త్వరగా కోలుకోవాలంటూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నాని త‌దిత‌రులు ట్వీట్లు పెడుతున్నారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను సర్.. త్వరలోనే మీకు అంతా బాగుపడుతుందని ఆశిస్తున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ వేశాడు.

అల్లు అర్జున్ స్పందిస్తూ.. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలియడం ఎంతో సంతోషంగా ఉంది.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ వేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement