Saturday, May 4, 2024

Breaking: షర్మిలకు రాజకీయ అవగాహన లేదు.. జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదన్నారు. ఆమె జగన్ వదిలిన బాణం కాదు..జగన్ వదిలేసిన బాణమన్నారు. షర్మిలనే బాణాలు మార్చినప్పుడు.. మేం అనకూడదా అన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే షర్మిలకు ఎందుకని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఏపీలో సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టే.. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారన్నారు. నేతలను తిట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారా ? అన్నారు. వైఎస్ఆర్ కూతురు కాబట్టి తిడితే తాము ఊరుకుంటామా అని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ ను ప్రధానిని చేయాలనేది వైఎస్ఆర్ కల అన్నారు. తండ్రి కలను నిజం చేసేందుకు షర్మిల ఎందుకు ప్రయత్నించడం లేదని అడిగారు. బీజేపీ డైరెక్షన్ లోనే ఏపీలో జగన్, తెలంగాణలో షర్మిల పనిచేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement