Tuesday, May 7, 2024

ఏడేళ్ల వయసులోనే కిలిమంజారోను ఎక్కిన విరాట్ చంద్ర

ఎంతో అనుభవం ఉన్నవారికే పర్వతాలను అధిరోహించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది ఏడేళ్ల వయసులోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించి హైదరాబాద్ చిన్నారి విరాట్ చంద్ర శభాష్ అనిపించుకున్నాడు. మార్చి 6న అతడు ఈ ఘనత సాధించాడు. దీంతో చిన్న వయసులోనే శిఖరాలను ఎక్కిన వారి జాబితాలో ఈ చిన్నారి చోటు దక్కించుకున్నాడు.

ముందు చాలా భయమేసినా.. తన లక్ష్యాన్ని చేరాలన్న సంకల్పంతో శిఖరాన్ని అధిరోహించానని విరాట్ చెబుతున్నాడు. తన కజిన్ల ద్వారా పర్వతాధిరోహణపై ఇష్టం పెరిగిందని విరాట్ చెప్పుకొచ్చాడు. వారి అనుభవాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నానన్నాడు. దీంతో వారిలాగానే తాను కూడా పర్వతాధిరోహణ చేయాలని భావించానని పేర్కొన్నాడు. దీని గురించి తన తల్లిదండ్రులకు చెప్పానని, భరత్ సార్ దగ్గర శిక్షణను ఇప్పించారని వెల్లడించాడు. కాగా విరాట్‌లో పర్వతాధిరోహణపై ఎంతో తపన ఉండేదని అతడి కోచ్ భరత్ చెప్పారు. అతడితో పాటు మిగతా పిల్లలకు శిక్షణనిచ్చినా వారు మధ్యలోనే తప్పుకున్నారని, విరాట్ మాత్రం అనుకున్నది సాధించేందుకు పట్టుదలతో కృషి చేశాడన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement